అమరావతి, ఏప్రిల్ 21: రాష్ట్రంలో స్థిరాస్తి మరియు భవన నిర్మాణ రంగానికి ఊతమిచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీ స్థలాలపై ఇప్పటివరకు పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్న పన్నులో, భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ 50 శాతం మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు అసెంబ్లీలో ఇప్పటికే ఆమోదం పొందిన చట్ట సవరణకు అనుగుణంగా పురపాలక శాఖ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, భవన నిర్మాణం ప్రారంభమైన తేదీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే వరకు ఖాళీ స్థల పన్నులో సగం రాయితీ లభించనుంది.
ఈ మేరకు అసెంబ్లీలో ఇప్పటికే ఆమోదం పొందిన చట్ట సవరణకు అనుగుణంగా పురపాలక శాఖ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, భవన నిర్మాణం ప్రారంభమైన తేదీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే వరకు ఖాళీ స్థల పన్నులో సగం రాయితీ లభించనుంది.రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ, పూర్తి పన్ను చెల్లించాల్సి రావడం భవన నిర్మాణదారులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు పలుమార్లు పన్ను తగ్గింపు కోరగా, ప్రభుత్వం వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ సడలింపుతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

