ఉరవకొండలో పోషణ పక్వడ కార్యక్రమం నిర్వహణ

 TRUE TIMES INDIA
0

ఉరవకొండ, ఏప్రిల్ 21: ఉరవకొండ ప్రాజెక్ట్ పరిధిలోని పాళ్తూరు సెక్టార్ హవలిగి–6 మరియు విడపనకల్లు–8, 6 అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్వడ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం Integrated Child Development Services (ICDS) ఆధ్వర్యంలో సీడీపీవో బి.ఎన్. శ్రీదేవి పర్యవేక్షణలో జరిగింది.

ఈ సందర్భంగా 2 సంవత్సరాల లోపు పిల్లలకు సరైన పోషకాహారం అందించడం వల్ల మెదడు అభివృద్ధి వేగంగా జరుగుతుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్యం పట్ల బాధ్యత తల్లులకే కాకుండా తండ్రులకు కూడా సమానంగా ఉంటుందని తెలియజేశారు.

పిల్లలకు ఇవ్వాల్సిన ఆరోగ్యకరమైన ఆహారంపై హెల్త్ ఫుడ్ డెమో నిర్వహించి, ఇంట్లో తయారు చేసే ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బయట ఆహారం ఇవ్వవద్దని, సెల్‌ఫోన్ వినియోగం పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల బరువు, ఎత్తు కొలిచి వారి ఆరోగ్య స్థితిని తల్లులకు వివరించారు. వేసవికాలం దృష్ట్యా ఎండల్లో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, అవసరమైనప్పుడు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు వినియోగించుకోవాలని చెప్పారు. అవి అందుబాటులో లేకపోతే ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల వద్ద తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా వ్యర్థ పదార్థాలతో బొమ్మలు తయారు చేయించి అంగన్‌వాడీ కేంద్రాలకు అందజేశారు. కార్యక్రమంలో పాళ్తూరు పీహెచ్‌సీ వైద్యురాలు డా. సుష్మా, హెల్త్ సూపర్వైజర్ సుధాకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పుష్పవతి, విజయ, ప్రథమ్ జిల్లా కోఆర్డినేటర్ రమోహన్, అంగన్‌వాడీ వర్కర్లు అంబిక, రుద్రాణి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!