ఉరవకొండలో ఆర్టీసీ డిపో గేట్ మీటింగ్ విజయవంతం

 


ఉరవకొండ, మే 17:

రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం ఉరవకొండ ఆర్టీసీ డిపో వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ ఘనంగా విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి రీజనల్ సెక్రటరీ కె. కొండన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డిపో సెక్రటరీ బి. మాబు, డిపో ప్రెసిడెంట్ మురళీ నాయక్, సీసీఎస్ పీవీ శ్రీనివాస్, గ్యారేజ్ సెక్రటరీ శ్రీరాములు మరియు ఇతర డిపో నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ సమిష్టిగా పాల్గొని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన ఈ గేట్ మీటింగ్‌ను విజయవంతం చేశారు.