పొదుపు చర్యలలో భాగంగా అమరావతి భారీ నిర్మాణం పనులు ఆపేయండి!

Malapati
0

 

రాష్ట్రవ్యాపిత నిరసనల సందర్భంగా వైసీపీ పిలుపు


!

     పశ్చిమాసియా సంక్షోభం నుండి బయట పడడానికి ముఖ్యమంత్రి,ప్రధాన మంత్రులు తన సెక్యూరిటీ వాహనాలను తగ్గించుకోవడం,పెట్రోలు, డీజిల్,గ్యాస్ ధరలు పెంచడం కాదు,లక్ష కోట్లతో నిర్మిస్తున్న అమరావతి భారీ నిర్మాణ పనులను నిలిపివేస్తే అక్కడ ఉపయోగిస్తున్న పెట్రోలు,డీజిల్, గ్యాస్ ఇనుము,రా మెటీరియల్ మిగిలిపోయి రాష్ట్రమంతా వినియోగించుకోవచ్చు,

లక్ష కోట్లు ఆదా చేయవచ్చు, తద్వారా పశ్ఛిమాసియా సంక్షోభం నుంచి రాష్ట్రం తక్షణం బయటపడు తుంది.

     ప్రజలు దేశహితం కోరాలి, పాలకులు దేశాన్ని దోచుకోవాలి.అదానీ, అంబానీలకు దోచి పెట్టాలి.ఇదే పాలకులు ఇచ్చే సందేశం?

     నరేంద్ర మోడీ,చంద్రబాబు నాయుడు దేశ ప్రజలు దేశహితం కోరి పొదుపు చేయాలని,అందులకు సంవత్సర కాలం బంగారం కొన వద్దు,ఫంక్షన్లు చేయవద్దు,విదేశీ విహార యాత్రలకు వెల్లవద్దు,విదేశీ వస్తువులు కొన వద్దు,ఇంధన వినియోగం తగ్గించాలి,ఈ వీలు వాడాలి,కార్లు పూలింగ్ చేయాలి,వంటనూనె వినియోగం 10 శాతం తగ్గించుకోవాలి అని ప్రజలకు ఒకవైపు పిలుపునిస్తూ మరోవైపు వారు మాత్రం విదేశీ దుస్తులే ధరిస్తారు,విదేశాలు తిరుగుతారు,ప్రత్యేక విమానాలలో ప్రయాణాలు చేస్తారు.ఎన్నికలలో డబ్బులు పంచుతారు,వారి మీటింగులకు లక్షలాది మంది ప్రజలను తరలిస్తారు.వారానికి ఒకసారి సింగపూర్ కు,హైదరాబాదుకు వెళతారు,నెలవారీ జీతాలు,పెన్షన్ల రూపంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తమ ఖాతాలలో వేసుకుంటారు.పార్లమెంటు, అసెంబ్లీలలో తక్కువ రేటుకే తిను బండారాలను అందుబాటులో ఉంచుకుంటారు.

   ఈ మాటలు వింటుంటే పాచిన పండ్లవాడి సంపదను బంగారు పండ్ల వాడు తినేసాడన్న సామెత గుర్తుకు వస్తుంది.

   నీతులు చెప్పేవారు మొదట తాము పాటించి ఇతరులకు చెప్పాలి,పూర్వం ఒక తల్లి తన బిడ్డను ఆ గ్రామ పెద్దమనిషి దగ్గరకు తీసుకు పోయి అయ్యా తన కుమారడు మిఠాయిలు అధికంగా తింటున్నాడు దానివల్ల అతని ఆరోగ్యం చెడిపోతున్నది మీరు చెబితే మానేస్తాడని అడిగిందట,అది విన్న ఆ పెద్దమనిషి ఆలోచన చేసి నెల తర్వాత రమ్మంటాడు,ఆ తల్లి నెల తరువాత మరలా తన బిడ్డను తీసుకొని వెళుతుంది అప్పుడు ఆ పెద్దమనిషి మిఠాయిలు తినవద్దని ఆ పిల్లవానికి చెబుతాడు,ఇది చూసిన ఆ తల్లి ఇంత చిన్న విషయం చెప్పడానికి నెల రోజులు ఎందుకు పట్టిందయ్యా అని అడుగు తుంది,అప్పుడు ఆ పెద్దమనిషి నాకు కూడా మిఠాయిలు అంటే చాలా ఇష్టం,నేను కూడా ఎక్కువగా తింటాను,నేను తింటూ ఆ పిల్లవాడికి తినవద్దని చెప్పడం తన్ను మాలిన ధర్మం అవుతుంది కాబట్టి ఈ నెల రోజులలో నేను మిఠాయిలు తినడం మానేసి నీ బిడ్డకు తినవద్దని చెప్పానని చెబుతాడు,ఇది నీతి వంతుల లక్షణం.

   ఒకవైపు దేశ సంపదను, పంచభూతాలను అదాని,అంబానీ లాంటి వారికి అప్పగించి,మరోవైపు దేశ ప్రజలకు చేయడానికి పని లేకుండా,మానవ వనరులను కార్పోరేట్ సంస్థలకు దారా దత్తం చేసి,వారి ఆదాయ మార్గాలను మూసివేసి,మరోవైపు ప్రజల బలహీనతలను రెచ్చగొట్టి అధికారం చేపట్టి, ఏమి తినాలో,ఏమి కట్టాలో,ఏమి మాట్లాడాలో,ఏ మతంలో ఉండాలో,ఏ ప్రాంతంలో నివసించాలో ఎవరికి వారు సొంత రాజ్యాంగాలను రచించుకొని అమలు చేస్తూ,ఆపదలు, సంక్షోభాలు వచ్చినప్పుడు పూజలు,పునస్కారాలు చేయమని,గంటలు మ్రోగించమని,కంచాలు కొట్టాలని దేశాన్ని మూఢత్వం వైపు నడిపిస్తూ,మరోవైపు పొదుపు మంత్రం పాటించడని చెప్పడం దేశ హితం కాదు పాలకుల చేతగానితనం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!