ప్రభుత్వ హాస్టళ్లలో వసతులు కల్పించకుంటే విద్యార్థుల భవిష్యత్తు శూన్యం: బి. మోహన్ నాయక్

Malapati
0

 



ఉరవకొండ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతుల కొరతపై హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి. మోహన్ నాయక్ మండిపడ్డారు. పట్టణంలోని హాస్టల్ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సొంత భవనాలు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు మరియు నీటి సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సౌకర్యాలు లేక చదువు మానేసి విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని, ఆడపిల్లలకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేస్తున్నారని భీష్మించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి పెండింగ్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!