ప్రకృతి మనకు ప్రసాదించిన గాలి, నీరు, నేల, అడవులు లాంటి అద్భుతమైన వనరులను కాపాడుకోవడం మన మనుగడకు అత్యంత అవసరమని సీనియర్ ఎలక్ట్రీషియన్ ఉక్కీసుల గోపాల్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉరవకొండ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారంఉరవకొండలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలుజరుపుకొన్నారు *అనవసరంగా వెలిగే ఒక బల్బును ఆపడం అంటే.. వాతావరణంలోకి చేరే కొంత కాలుష్యాన్ని అడ్డుకోవడమేఅన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉరవకొండ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ ఎలక్ట్రీషియన్ ఉక్కీసుల గోపాల్ పర్యావరణ పరిరక్షణలో విద్యుత్ ఆదా యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
విద్యుత్ ఆదా చేయండి - బొగ్గు వినియోగాన్ని, తద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించండి.
ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ (గ్రీన్ ఎనర్జీ) ఏర్పాటుకు మొగ్గు చూపండి.
వాడనప్పుడు మొబైల్ ఛార్జర్లు, టీవీల స్విచ్‌లను సాకెట్ వద్దే ఆఫ్ చేయండి.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా దూరం పెట్టండి.
ప్రతి ఒక్కరూ కనీసం 5 మొక్కలు నాటి, వాటిని రక్షించండి.
భవిష్యత్ తరాల మనుగడ కోసం ఇప్పటికైనా మేల్కొని ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం! ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అబ్దుల్, సానిటరీ మేస్త్రి లేపాక్షి మహేష్ మరియు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.


