ఫీ "జులుం" అరికట్టడంలో విద్యాశాఖ విఫలం
విద్యను వ్యాపారంగా మార్చిన చైతన్య, నారాయణ
జీవో నెంబర్ 1,42 ప్రతి పాఠశాలలో అమలుకు చర్యలు చేపట్టాలి
ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి. యం.ఓబులేసు యాదవ్
అక్షరాలపై లక్షలా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు విద్య హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రైవేట్ కార్పొరేట్ కాసులకు విద్యాశాఖ అధికారులు అమ్ముడుపోయరని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి. యం.ఓబులేసు యాదవ్ మండిపడ్డారు
అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో సమావేశం నిర్వహించారు
అనంతరం ఆర్ఎస్ఎఫ్ ఉద్యమాలకు ఆకర్షితులైన వివిధ సంఘాల నేతలు ఆర్ఎస్ఎఫ్ లో రాష్ట్ర అధ్యక్షులు సమక్షంలో చిరంజీవి, నందకిషోర్,గురు సాయి తదితరులు కండవా వేసుకొని చేరారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సి.వంశీ పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి. యం.ఓబులేసు యాదవ్ మాట్లాడుతూ విద్యను వ్యాపారం చేసిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అనుమతి లేకుండా అక్రమ అడ్మిషన్ చేస్తున్న యాజమాన్యాలకి అమ్ముడుపోయిన విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కిన కార్పొరేట్ విద్యాసంస్థలు పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్యపుస్తకాల అమ్మకానికి పెట్టిన ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యం విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునపే అడ్మిషన్స్ ఫుల్ అయ్యాయని చెప్పడం విడురం అన్నారు ఫీజు నియంత్రణ చేయడంలో విద్యాశాఖ అధికారులు విఫలం అయిందన్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు పెంచాలంటే డిస్టిక్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (DFRC ) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవో నెంబర్ 42 ఒక పక్కన చెబుతూ ఉన్న ఆ నిబంధనలో విరుద్ధంగా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారని తెలిపారు యాజమాన్యం 1-1-1994 జీవో నెంబర్ 1 ప్రకారం పాఠశాల యాజమాన్యం ఐదు శాతం లాభాలు మాత్రమే ఆశించి 50% ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలని జీవో చెబుతున్న జీవో నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అడ్మిషన్ కోసం డొనేషన్లు 3500 నుంచి 6000 వరకు వసూలు చేస్తున్నారన్నారు ఎల్కేజీ విద్యార్థికి 31,000 ఫీజు విద్యార్థి తల్లిదండ్రుల రక్తాన్ని ఫీజుల రూపంలో జలగల్ల పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాత్రూంలను తలపించే తరగతి గదులు ఉన్న పర్మిషన్ల అర్హత లేని ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందడం సాధ్యమా అని ప్రశ్నించారు ఫీజు స్ట్రక్చర్ ను నోటీసు బోర్డులో డిస్ప్లే చేయాలని డిమాండ్ చేశారు యూనిఫామ్స్, బుక్స్, ఇతర మెటీరియల్స్ విద్యాసంస్థలోనే అమ్మకానికి పెట్టిన పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు వివరిస్తున్నారని మండిపడ్డారు

